ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అండర్ -23 ఏపీ క్రికెట్ టీం ఎంపికైన వరుణ్ సాత్విక్.

10 అక్టోబర్, 2026

అండర్ -23 ఏపీ క్రికెట్ టీం ఎంపికైన వరుణ్ సాత్విక్. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-జగ్గయ్యపేట

జగ్గయ్యపేట పట్టణానికి చెందిన టి. వరుణ్ సాత్విక్ అండర్-23 రాష్ట్ర క్రికెట్ జట్టుకు ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 5న జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్‌లో 5 ఇన్నింగ్స్‌లలో 433 పరుగులు సాధించడంతో పాటు, స్టేట్ ప్రాబబుల్స్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసి ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం అనంతపురంలో జరుగుతున్న రాష్ట్ర కోచింగ్ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న వరుణ్‌ను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్