ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్యంపై దాడి : పోతిన మహేష్‌

10 అక్టోబర్, 2026

ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్యంపై దాడి
జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామాకు పోతిన మహేష్‌ డిమాండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎస్‌ఇసి కార్యాలయం వద్ద పోతిన మహేష్ నిరసన.. అరెస్టు


​ప్రజాశక్తి-విజయవాడ సిటీ

ఎస్‌ఐఆర్‌ పేరుతో దేశవ్యాప్తంగా 13.5 కోట్ల మంది ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సామాజిక కార్యకర్త పోతిన వెంకట మహేష్‌ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద శనివారం ఆయన నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్న మహేష్‌ను పోలీసులు అరెస్టు చేసి జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, అనంతరం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ.. ప్రజల తీర్పుతో ఏర్పడే ప్రభుత్వాలు కావాలే తప్ప, ఈవీఎంలను మేనేజ్ చేసి వచ్చే ప్రభుత్వాలు కాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బి.వి. రావు, ఎస్‌.వి. బాబు, పులిపాక ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్