బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్విమ్మింగ్ లో కెబిఎన్ కు జాతీయస్థాయి పతకాలు

1 గంట క్రితం

స్విమ్మింగ్ లో కెబిఎన్ కు జాతీయస్థాయి పతకాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-విజయవాడ సిటీ

అఖిల భారత స్విమ్మింగ్ ఫెడరేషన్ కప్ 2026 పోటీల్లో కెబిఎన్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఒక బంగారు, మూడు రజత, ఒక కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి ఈ వివరాలను వెల్లడించారు. మొదటి సంవత్సరం బి.కాం కంప్యూటర్స్ విద్యార్థి పి.కిరణ్ 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో బంగారు పతకం, 200 మీటర్ల ఫ్రీ స్టైల్ లో రజత పతకం, 100 మీటర్ల ఫ్రీ స్టైల్ లో కాంస్య పతకంతో పాటు సర్ఫేస్ రిలే 4x50 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించాడు. అలాగే బిబిఎ మొదటి సంవత్సరం చదువుతున్న టి.పృధ్వి ప్రసాద్ 4x100 సర్ఫేస్ రిలే విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్నాడు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ టి.శ్రీనివాసు తెలిపారు. విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యాయామ విభాగాధిపతి డి.హేమచంద్రరావుతో పాటు పతకాలు సాధించిన విద్యార్థులను హిందూ హై స్కూల్స్ కమిటీ అధ్యక్షుడు టి.శేషయ్య, కోశాధికారి గోళ్ళ బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం.వేంకటేశ్వరరావు, పి.ఎల్.రమేష్ తదితరులు అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్