బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హామీలు అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్ డిమాండ్

1 గంట క్రితం

హామీలు అమలు చేయాలి
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్ డిమాండ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు గొలుగొండ మండల ప్రజలకు కూటమి ప్రభుత్వం సుమారు రూ.194 కోట్లు బకాయి పడిందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ ఆరోపించారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల కింద చెల్లించాల్సిన మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గొలుగొండ మండలంలో వైఎస్సార్ ఆసరా కింద రూ.14 కోట్లు, రైతు భరోసా కింద రూ.20 కోట్లు, అమ్మఒడి కింద రూ.17 కోట్లు, చేయూత కింద సుమారు రూ.13 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో కలిపి తొలి రెండున్నరేళ్లలోనే రూ.65 కోట్ల ప్రయోజనం కల్పించామన్నారు. చీడిగుమ్మలలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 2021 సెప్టెంబర్ 15న రూ.2.55 కోట్లతో పీహెచ్‌సీ మంజూరు చేశామని, భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పాత పంచాయతీ కార్యాలయంలోనే ఆసుపత్రిని నిర్వహిస్తూ 11 మంది సిబ్బందితో సేవలు అందించామని వివరించారు.

కూటమి ప్రభుత్వం 28 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చిన నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గొలుగొండ మండల ప్రజలకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. చీడిగుమ్మలలో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్