ప్రజాశక్తి- పెందుర్తి
జివిఎంసి ఎన్నికలకు వార్డుల రిజర్వేషన్ వెల్లడి కావడంతో ఇంతవరకు ఉన్న ఉత్కంఠకు తెరపడగా, ఇపుడు పోటీ అభ్యర్థులెవరనే విషయమై ఆసక్తి నెలకొంది. జివిఎంసి 13వ వార్డు బిసి జనరల్కు రిజర్వ్ కావడంతో కూటమి అభ్యర్ధిగా ఇందల రమణ పోటీ రేసులో ముందంజలో ఉన్నారని స్థానికుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వార్డు పరిధిలో కొన్ని రోజులుగా ప్రచారం చేస్తుండడంతో ఇక అధిష్టానం ప్రకటనే తరువాయి అని స్థానికులు అంటున్నారు. ఇక వార్డులో సుమారు 19500 ఓటర్లుండగా, ఈ ప్రాంతంలో ఎప్పటినుండో అందరికీ పరిచయస్తులుగా రమణ ఉన్నారని స్థానికులు అంటున్నారు







కామెంట్లు (0)