బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇద్దరు తిరుమల ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

1 గంట క్రితం

ఇద్దరు తిరుమల ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని తిరుమల ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్‌ నియామకాల్లో ఇద్దరు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గతనెల 26న మంగళగిరికి చెందిన ఎఫ్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ నియామకాలు చేపట్టింది. రాత పరీక్షకు 31 మంది విద్యార్థులు హాజరుకాగా, 26 మంది తదుపరి దశకు అర్హత సాధించారు. వీరికి సాంకేతిక, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలు నిర్వహించగా సిఎస్‌ఇ విభాగం నుంచి ఒకరు, ఏఐ అండ్‌ ఎంఎల్‌ విభాగం నుంచి మరొకరు తుది ఎంపికయ్యారు. వీరు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్లుగా ఏడాదికి రూ.5.8 లక్షల వేతన ప్యాకేజీతో విధుల్లో చేరనున్నారని సంస్థ హెచ్‌ఆర్‌ ప్రతినిధి మాధవి వెల్లడించారు. ఎంపికైనవారిని కళాశాల ఛైర్మన్‌ బొల్లా బ్రహ్మనాయుడు, కార్యదర్శి, కరస్పాండెంట్‌ రావెల సత్యనారాయణ, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైవి నారాయణ, శిక్షణ, నియామకాల అధికారి ఎం.సాంబశివరావు అభినందించారు. కళాశాలలో అందించిన శిక్షణ, మాక్‌ ఇంటర్వ్యూలు, ప్లేస్‌ మెంట్‌ తరగతులు ఉద్యోగ సాధనకు దోహదపడ్డాయని ఎంపికైన విద్యార్థులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్