టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ రాణే కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిలా’. ఈ సినిమా పోస్టర్‌తో పాటు విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ప్రేమకథ, ప్రతీకార నాటకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాదియా ఖతీబ్ కథానాయికగా నటిస్తోంది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కశ్మీర్, వియత్నాంలో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. జీ స్టూడియోస్‌తో కలిసి ఒమంగ్ కుమార్, హిమాంశు తివారి, అజయ్ సింగ్, ధనంజయ్ సింగ్, వనితా గరుడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సిలా’ ఫస్ట్ లుక్ పోస్టర్
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026, 07:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)