శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం సీనియర్ నాయకులు కొరిటాల కోటేశ్వరరావుకు సతీవియోగం

9 గంటల క్రితం

Bereavement for senior CPM leader Koritala Koteswara Rao his wife passes away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సిపిఎం సీనియర్ నాయకులు కొరిటాల కోటేశ్వరరావు భార్య రామ పంచాక్షరి (89) శుక్రవారం రాత్రి వయోభారంతో కన్నుమూశారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ హయాంలో నరసరావుపేట తాలూకా పరిధిలో సిపిఎం కార్యాలయం తొలి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని సిపిఎం సీనియర్ నాయకులు కామినేని రామారావు తెలిపారు. చిన్నతనం నుంచే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన కోటేశ్వరరావు, జీవితాంతం కమ్యూనిస్టు ఉద్యమంతో అనుబంధాన్ని కొనసాగించారన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలపై అప్పటి ప్రభుత్వం నిర్బంధకాండ కొనసాగించిన సమయంలో పరిస్థితుల దృష్ట్యా సర్వేయర్‌ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ సిపిఎం తో తన అనుబంధాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. కోటేశ్వరరావు తల్లి పున్నమ్మ కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలకు ఆశ్రయం కల్పించేవారని, ఏ సమయంలో ఎంతమంది ఇంటికి వచ్చినా అలుపెరగకుండా భోజన ఏర్పాట్లు చేసేవారని కామినేని రామారావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె నివాసం ఉండే ప్రాంతం ఇప్పటికీ కొరిటాల పున్నమ్మ చౌక్ గా పిలుస్తారన్నారు. రామ పంచాక్షరి మృతదేహాన్ని సిపిఎం నరసరావుపేట పట్టణ, మండల నాయకులు డి.శివకుమారి, షేక్ సిలార్ మసూద్, సయ్యద్ రబ్బానీ, దరువూరి సుబ్బారావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కోటేశ్వరరావు, కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ పంచాక్షరి మృతి పట్ల సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్