శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

6 రోజుల క్రితం

feb37f02-3965-4a54-9e25-097bf8e0b78a.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 08:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఓటు వేసిన ఎమ్మెల్యే

ప్రజాశక్తి – వినుకొండ : వినుకొండ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టణంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలీసుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా 8వ వార్డుకు చెందిన ఓటరు, ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆయన ఓటు వేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్