శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అధికారుల నిర్లక్ష్యం - అభ్యర్థుల లిస్టులో అవకతవకలు

6 రోజుల క్రితం

cpm change to cpi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 12:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సత్తెనపల్లి : సత్తెనపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బూత్ ల వద్ద ఉండే అభ్యర్థుల లిస్టులో అవకతవకలు ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించాయి. అభ్యర్థికి చెందిన పార్టీ పేరు సిపిఎం కు బదులు సిపిఐ అని ఉండటంతో అధికారుల నిర్లక్ష్యం పై ఓటర్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. సత్తెనపల్లి మున్సిపల్ ఎన్నికల్లోని పోలింగ్ బూత్ ల ముందు అంటించే అభ్యర్థుల లిస్టులో సిపిఎం చైర్పర్సన్ అభ్యర్థి ధరణికోట విమల పార్టీ సిపిఎం కు బదులుగా సిపిఐ అని నమోదు చేశారు. ఆ లిస్టులో సిపిఎం పార్టీ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ... సిపిఐ అని పేర్కొనడం విశేషం. ఈ గుర్తుల తారుమారు ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.


change

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్