శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వినుకొండలో టిడిపి దుశ్శాసనపర్వం - వైసిపి అభ్యర్థిని అర్చన మూర్తిపై దాడి

6 రోజుల క్రితం

TDPs Dushasana Parvam reign of misrule/atrocities in Vinukonda Attack on YSRCP candidate Archana Murthy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వినుకొండ (పల్నాడు) : వినుకొండలో దుశ్శాసనపర్వం చెలరేగింది. 8 వ కౌన్సిలర్ వైసిపి అభ్యర్థి అర్చన మూర్తిపై టిడిపి రౌడీ పివి సురేష్ పెనుగొండ శ్రీనివాసరావు మరికొందరు యువకులు కలిసి దాడికి పాల్పడ్డారు. అర్చన మూర్తి కిందపడిపోయి స్పృహ కోల్పోయింది. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ .... పోలింగ్ కేంద్రం వద్ద గూండాలను చేరవేసిన టిడిపి అభ్యర్థి పెనుగొండ శ్రీనివాసరావు కోటి రూపాయలు వెచ్చించి వైస్ చైర్మన్ గా గెలవాలని ధ్యేయంతో టిడిపి గూండాలతో 8వ వార్డు వైసిపి అభ్యర్థిని అర్చన మూర్తి పై అసభ్యకరంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారా సీఐ ప్రభాకర్..? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అర్చన మూర్తిని ఏకవచనంతో దూషించడమే మీ పోలీస్ విధులా..? అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్