మన్యం : నిన్న (మంగళవారం) తోటపల్లి ఎడమకాలువలో ప్రమాదవశాత్తూ జారిపడి గల్లంతైన యువకుడి (35) మృతదేహాన్ని అధికారులు గుర్తించి బుధవారం వెలికితీశారు. మృతుడు హేమంత్ క్రిష్ణ (35) గా గుర్తించారు. నిన్నటి రోజున సీతానగరం మండలంలో ఏగొట్టి వలస గ్రామం వద్ద ఉన్న తోటపల్లి ఎడమ కాలువలో విజయవాడకి చెందిన హేమంత్ కృష్ణ అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. గ్రామస్తులంతా ఆ యువకుడి ఆచూకీ కోసం కాలువ వెంబడి గాలించారు. గ్రామంలో తన మిత్రుని బారసాల ఫంక్షన్ కు యువకుడు వచ్చినట్లు సమాచారం. ఈరోజు ఉదయం కాలువలో యువకుడి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.
తోటపల్లి కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం వెలికితీత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 01:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)