వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం మండలం పనసనందివాడ గ్రామ సమీపంలోని నాగావళి నది పరివాహక ప్రాంతాన్ని బుధవారం పాలకొండ సిఐ ఎ.ప్రసాద రావు, ఎస్ఐ ఎస్.షణ్ముఖ రావు వీరఘట్టం తహసీల్దార్ (MRO) తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి ... నాగావళి నది నీటి ప్రవాహం, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. అధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పడవలను నడపకూడదని పడవ నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
నాగావళి నది పరివాహక ప్రాంతంలో అధికారుల పర్యటన
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 01:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)