శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులకు వక్తృత్వ పోటీలు......

19 నవంబర్, 2026

విద్యార్థులకు వక్తృత్వ పోటీలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -చింతూరు

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్‌ ఎన్. మణిమాల తెలిపారు. ‘గ్రంథాలయాల్లో కృత్రిమ మేధస్సు అనువర్తనాలు, అవగాహన, గ్రంథాలయ సేవలో కృత్రిమ మేధస్సు వినూత్న వినియోగాలు’ అనే అంశంపై వక్తృత్వ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్‌ ‌మణిమాల మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పఠనా శక్తిని, జ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తాయన్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్