సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ చైతన్య విద్యార్థి, తల్లి మృతి కేసును సిబిఐ కి అప్పగించాలి : మంద కృష్ణమాదిగ

20 సెప్టెంబర్, 2026

Case regarding the death of Sri Chaitanya student and mother should be handed over to the CBI: Manda Krishna Madiga
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శింగరాయకొండ (ప్రకాశం) : శింగరాయకొండ మండలం మూలగుంటపాడు శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ దగ్గర విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందిన సంగతి విదితమే. విద్యార్థి తల్లీ మౌలాబీ కూడా పోరాటం చేస్తూ మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ పరిసరాలను ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కృష్ణమాదిగ పరిశీలించారు. ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసు పూర్తిగా తెలుసుకొని సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని వైసిపి నాయకులు వైఎస్ జగన్ కూడా సిబిఐ విచారణ కోసం ప్రయత్నం చేయాలనీ కోరారు. లేకపోతే రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్