ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాకలలో విద్యా కమిటీ ఎన్నికలు

03 అక్టోబర్, 2026

Education Committee Elections in Pakala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 03:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శింగరాయకొండ (ప్రకాశం) : శింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ హై స్కూల్ లో గురువారం జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు కోరం వాయిదా పడటంతో శనివారం ఆ ఎన్నికలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. విద్యాశాఖ అధికారులు ఆధ్వర్యంలో చివరికి ఓటింగ్ కు చేతులెత్తే వరకు వెళ్లడంతో అధికారులు విద్యార్థుల తల్లిదండ్రుల చేత చేతలు ఎత్తడం జరిగింది . తెలుగుదేశం మద్దతుదారుడు కోడూరి వెంకట్రావుకు అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. వైసిపి అభ్యర్థికి ఎవరు చేతులు ఎత్తకపోవడంతో టిడిపి మద్దతుదారుడు కోడూరు వెంకటరావు చైర్మన్ గా ఎంపికైనట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకల హైస్కూల్ దగ్గర ఉండి తీవ్రమైన పోటీ నెలకొంది ఎస్ఐ లేళ్ల సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో హైస్కూల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
011

022


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్