సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యవసాయాధికారులతో మంత్రి రవికుమార్ సమీక్ష

2 రోజుల క్రితం

Minister Ravikumar holds review with agricultural officials
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అద్దంకి (ప్రకాశం) : అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ శుక్రవారం పర్యటించారు. పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ రైతులకు అందిస్తున్న విత్తనాల పై మంత్రి గొట్టిపాటి ఆరా తీశారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఎల్ నినో ప్రభావాన్ని రైతులకు వివరించి.. అన్నదాతలకు సరైన పంటలను సూచించాలన్నారు. హార్టీకల్చర్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి.. ఉపయోగాలను, రాయితీలను ప్రజలకు వివరించాలన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ... సహజ పద్ధతులతో పంటలు సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ఎల్ నినో ముప్పు ఎదుర్కొనేందుకు పీఎండీఎస్ విధానాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేసి... గ్రీన్ కవర్ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్