ప్రజాశక్తి - శింగరాయకొండ : సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం పాకాల బీచ్‌ను ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తహసీల్దార్ ఎన్.వి.బి. రాజేష్ ఆదివారం తెలిపారు. పర్యాటకులకు బీచ్‌లోకి అనుమతి లేదని, సముద్ర స్నానాలు పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ ఆంక్షలకు సహకరించాలని కోరారు.
ఇద్దరి మృతదేహాలు లభ్యం
పాకాల సముద్ర తీరంలో శనివారం గల్లంతైన వేదెండ్ల విష్ణు, వేదెండ్ల నారాయణ మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎన్.వి.బి. రాజేష్ ఆధ్వర్యంలో మత్స్యకారుల సహకారంతో బోట్లు ఏర్పాటు చేసి ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. విష్ణు మృతదేహాన్ని గాలాల సహాయంతో బయటకు తీయగా, నారాయణ మృతదేహం చెల్లెమ్మగారి పట్టపుపాలెం సమీపంలో సముద్రంలో కొట్టుకొచ్చింది. రెండు మృతదేహాలు ఒడ్డుకు చేరినట్లు ఎస్సై లేళ్ల సుధీర్‌కుమార్, మెరైన్ సీఐ జి. సూర్యనారాయణ తెలిపారు.








కామెంట్లు (0)