సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థి తౌషిక్ తల్లి మౌలాబి పరిస్థితి విషమం

11 సెప్టెంబర్, 2026

The condition of Maulabi, mother of student Taushik, is critical.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 12:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒంగోలు ఆసుపత్రి నుండి హైదరాబాద్ కు తరలిoపు


శింగరాయకొండ (ప్రకాశం) : శింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి తౌషిక్ చావుకు కారకులను శిక్షించాలని గల్లీ నుండి ఏపి సచివాలయం వరకు పోరాడిన ఆ విద్యార్థి కన్నతల్లి మౌలాబీ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా మారింది. గత 20 రోజులుగా శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ ముందే కూర్చొని నిరసన తెలుపుతున్నా ... ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవడంతో, వ్యవస్థపై నమ్మకం నశించి తీవ్ర మనోవేదనతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం సమయంలో గడ్డి కి వాడే పురుగుల మందు తాగారు. దీంతో ఆమెను ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. శుక్రవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రి నుంచి హైదరాబాదు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మాత్రం గడ్డి మందు తాగడంతో ఆ మందు ప్రభావం అవయవాల మీద పడి పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పినట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్