అమ్యవారిపల్లి (ప్రకాశం) : జూలై 29 న జరిగే జాతీయ రహదారి దిగ్బంధనాన్ని జయప్రదం చేయాలని డిమాండ్ చేస్తూ .... ఆదివారం పొగాకు రైతులందరూ ప్రకాశం జిల్లా అయ్యవారిపల్లి గ్రామంలో నిరసన చేపట్టారు. పొగాకు రైతులను ఆదుకోవాలని, సమాఖ్య ద్వారా పొగాకును కొనుగోలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు వడ్డే హనుమారెడ్డి. సంయుక్త కిసాన్ వర్క్ జిల్లా నాయకులతోపాటు, రైతు సంఘం మండల కన్వీనర్ మాదాల రమణయ్య, నాగిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కామినేని శ్రీనివాసులు, అయ్యవారిపల్లి రైతులు ఆవుల నరేష్, డేగా ఓంకారం, డి.గోవిందు, కొప్పుల మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
పొగాకు రైతుల ఆందోళన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 11:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)