శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమి ప్రభుత్వం దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

04 ఆగస్టు, 2026

srikakulam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వం దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్, సిఐటియు నాయకులు పల్ల క్రిష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం హిరమండలం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహశీల్దార్ బాలక్రిష్ణ గారికి వినతిపత్రం సమర్పించారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ సమస్యలతో పాటు స్మశాన సమస్యలు, దళితుల నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సామాజిక భవనాలు కల్పనకు దళితులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సామాజిక శంఖారావం పేరుతో హిరమండలం మండలంలోని అనేక గ్రామాల్లో సర్వేలు చేపట్టామని ఆయన అన్నారు. దళితుల నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్య, త్రాగునీరు, స్మశాన వాటిక సమస్యలను గుర్తించామని ఆయన అన్నారు. దళితులకు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జస్టిస్ పున్నయ్య, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు శంకర్తు, తులసీరావు, ప్రసాద్, నీలారావు, హేమ, లక్ష్మీ, రామదాసు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్