ప్రజాశక్తి-టెక్కలి రూరల్ (శ్రీకాకుళం) : రాష్ట్ర ప్రభుత్వం రిమ్స్ వైద్యాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, కోనారి మోహనరావు టిడిపి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ .... కూటమి ప్రభుత్వం రిమ్స్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ప్రమోట్ చేస్తామని హామీ ఇచ్చి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎందుకు అమలు చేయలేదని ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కేంద్రాపురం రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. రిమ్స్ ఆస్పత్రిలో నాడు 350 బెడ్స్ కు ఎంత మంది సిబ్బంది ఉన్నారో నేడు 900 బెడ్స్ కు సంఖ్య పెరిగినా అదే సిబ్బంది ఉన్నారని, దీనివలన పేషెంట్స్ కు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐ సి యు కేర్ లో కనీసం ఎ సి లు కూడా పనిచేయడం లేదని, ప్రతి బెడ్డు కు వెంటిలేటర్ మోనా టిర్స్, ఇన్ ఫ్యూజన్ ఉండాలని ఇవి ఎమీ లేకపోవడంతో సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రిమ్స్ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గార్ని ప్రశ్నించారు. 41 మంది సిబ్బందికి నోటిఫికేషన్ వేసి రెండు సంవత్సరాలు గడిచిన పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. కొన్ని విభాగాలలో ఒకరు ఇద్దరు డాక్టర్స్ ఉన్నారని ఎండో కైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పిడియా ట్రిక్ సర్జన్ మొదలు విభాగాలకు పూర్తి డాక్టర్స్ లేరని డాక్టర్స్ లేకుండా పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలా వైద్యం అందుతుందని టిడిపి కూటమిని వారు ప్రశ్నించారు, ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి కనీసం వైద్యం కూడా అందజేయాలేని వాళ్లు మీరా అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గుండె, కిడ్నీ, నరాలు, మూత్ర సంబంధ వ్యాధులు, మెదడు, వెన్నుముక, క్యాన్సర్, రేడియేషన్ థెరపీ తది తర విభాగాలలో వారంలో రెండు రోజులు మాత్రమే చూస్తారు పేషెంట్స్ కు వైద్యం ఎలా అందుతుందని వారు ప్రశ్నించారు. డాక్టర్ స్కాన్ రాస్తే స్కాన్ చేయడానికి నెల రోజులు పడుతుంది, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి కి ప్రభుత్వ వైద్య రంగాన్ని నెట్టింది. జిల్లా కేంద్రం ఆసుపత్రి పరిస్థితి ఇది అయితే మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అని వారు ప్రశ్నించారు. కొన్ని విభాగాలకు ఒకరు లేదా ఇద్దరు డాక్టర్స్ ఉన్నా వైద్య పరికరాలు లేకుండా వైద్యం ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. క్యాత్ లేబ్ లేకపోతే కార్డియాలజీ డాక్టర్ ఎన్జీయో గ్రామ్ ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు, యూరాలజీ, న్యూరో సర్జన్ థియేటర్స్ సంభందించిన వైద్య పరికరాలు లేవని అందునా వైద్యం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మరొకవైపున ఐశ్లేషన్ వార్డు కూడా లేదు అని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని దీనివలన పేద, మధ్యతరగతి ప్రజలకు సరైన వైద్యం అందక పేషెంట్స్ ప్రాణాలు గాలి లో కలిసి పోతున్నాయని వారు విమర్శించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గా ప్రమోట్ చేయాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు, స్టాప్ నర్సులు, ఎఫ్ ఎన్ ఓ, ఎం ఎన్ ఓ, శానిటేషన్ సిబ్బందిని పెరిగిన బెడ్స్ కు అనుగుణంగా భర్తీ చేయాలని, వైద్య పరికరాలు వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమాలు చేస్తామని వారన్నారు.
ప్రభుత్వం వైద్యం నిర్వీర్యం : సిపిఎం నేతలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 11:33 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)