ప్రజాశక్త - కవిటి
ప్రభుత్వ పాఠశాలలను పచ్చదనంతో కళకళలాడించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ఆధ్వర్యాన మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఎంఇఒ ధనుంజయ మజ్జి ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మొక్కలను తీసుకెళ్లారు. అనంతరం ఎంఇఒ మాట్లాడుతూ పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను ఉపాధ్యాయులు, విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపుతోపాటు విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆపస్ మండల ప్రధాన కార్యదర్శి దుద్ది శరత్‌బాబు, తెప్పల రవి, శ్రీరామ్ బిసాయి, కర్రీ లింగరాజు, దశ లింగరాజు, నర్తు సోమేశ్వరరావు, రఘుమని తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)