గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జమ్ముకాశ్మీర్‌లో టూరిస్ట్‌ బస్సు బోల్తా

1 గంట క్రితం

jk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 04:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : జమ్మూ-కశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో టూరిస్ట్‌ బస్సు బోల్తా పడింది. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై గురువారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్లీపర్‌ బస్సు బోల్తాపడినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో సుమారు 30 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులేనని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రాంబన్‌ డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడినట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఎక్స్‌లో తెలిపారు. అధికారులతో తన కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. ప్రమాదం అనంతరం రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా సొరంగం ద్వారా ఒక మార్గాన్ని సింగిల్‌ క్యారేజ్‌వేగా తెరిచినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్