గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్యలు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

1 గంట క్రితం

జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్యలు
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 04:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కోటబొమ్మాళి

జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో గురువారం ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.


రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం

రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కొత్త పింఛన్లు, ఇళ్ల మంజూరుపై కార్యాచరణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయనున్న పింఛన్లు, నివాస గృహాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా చేరేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు.


ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పిస్తూ, వాటి ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్‌డిఒ ఎం.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఫొటో: 1. సమీక్షిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్