గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిఎంఎవైలో 52 మంది కి ఇళ్లు మంజూరు

1 గంట క్రితం

పిఎంఎవైలో 52 మంది కి ఇళ్లు మంజూరు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి,రామచంద్రపురం.

​ ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పిఎంఎవై) 2.0 పథకం కింద మున్సిపాలిటీ పరిధిలోని 52 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు ఉత్తర్వులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం అందజేశారు. పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే అర్హులైన కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి అన్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి మొత్తం రూ.2.50 లక్షల యూనిట్ కాస్ట్ అందుతుందనీ, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1.00 లక్షగా ఉంటుందనీ ఇది పూర్తి సబ్సిడీ అని మంత్రి వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన పట్టణ ప్రాంత కుటుంబాలు సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటును అందిస్తోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మంజూరైన ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత కాలవ్యవధిలో నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవసరమైన అవగాహన, అధికారుల సహకారం అందించాలని సూచించారు. గృహ నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు నేరుగా చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలన్నారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కెవిఆర్.రాజు, హౌసింగ్ డిఇఇ సుంకర రాంబాబు, టిడ్ కో టిఎల్టిసి బిందు, టిడిపి పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ, కంచుమర్తి బాబురావు, కట్టా నాగేశ్వరరావు, పొనకల చంటి, దిగుమర్తి వీరబాబు కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మంజూరు పత్రాలు అందిస్తున్న మంత్రి సుభాష్

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్