శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యువ పారిశ్రామికవేత్త దిలీప్‌కు పురస్కారం

29 అక్టోబర్, 2026

దిలీప్‌కు పురస్కారం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 05:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- టెక్కలి

మండలంలోని తోలుసురుపల్లికి చెందిన చిగీలిపల్లి దిలీప్ కుమార్‌కు యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపుని సంపాదించుకొని ప్రగతి రత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో సినీనటి శ్రీయ చేతుల మీదుగా పురస్కారాన్ని గురువారం అందుకున్నారు. బహుళ రంగాల్లో ఆయన ప్రదర్శిస్తున్న వ్యాపార నాయకత్వ ప్రతిభకు గుర్తింపుగా స్టార్జిటిక్ షిప్ ఇన్ మల్టీ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అవార్డు విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఐటి రంగంలో కొనసాగుతూనే మరోపక్క మ్యానుఫ్యాక్చరింగ్, ఆక్వాకల్చర్, ఎక్స్ పోర్ట్, విదేశీ ఉన్నత విద్య కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ వంటి విభిన్న రంగాల్లో దిలీప్ కుమార్ రాణిస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన సిగిలపల్లి దిలీప్‌కు ఈ పురస్కారంకు ఎంపిక కావడంపై తొలిసూరుపల్లి గ్రామస్తులు అభినందించారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్