శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలి

6 రోజుల క్రితం

acecbaa9-b4d5-4898-84d2-8a32d3c5d021.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 09:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

  • ఓటు వేసిన టీడీపీ, వైసీపీ చైర్మన్ అభ్యర్థులు

ప్రజాశక్తి – హిందూపురం : ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆదివారం హిందూపురం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ తన సతీమణి వసుంధర దేవితో కలిసి ఉదయం 8 గంటలకు చౌడేశ్వరి కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీఎస్ మంజునాథ్ తన సతీమణితో కలిసి ముదిరెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. వైసిపి చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షాజియా తన భర్తతో కలిసి రహమత్‌పురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రధాన రాజకీయ పార్టీల చైర్మన్ అభ్యర్థులు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో హిందూపురంలో ఎన్నికల సందడి నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్