కదిరి: దేశ వ్యాప్తంగా విడుదలైన నీట్ పీజీ -2026 లో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కి చెందిన వికాస్ రెడ్డి ఆల్ ఇండియా 1453వ ర్యాంక్ సాధించారు. ఇందుకు సంబంధించి వివరాలలోకి వెళ్తే జాతీయ స్థాయి వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2026 ఫలితాలలో కదిరి పట్టణానికి చెందిన డాక్టర్ వై. వికాష్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. స్థానిక ఎన్జీవో కాలనీకి చెందిన ఆయన, జాతీయ స్థాయిలో 1453వ ర్యాంకు సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. డాక్టర్ వికాష్ రెడ్డి సాధించిన ఈ గొప్ప విజయం పట్ల ఆయన తల్లిదండ్రులు వి. వింధ్య రాణి, వై.వి. సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమారుడు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని వారు అన్నారు. భవిష్యత్తులో వికాష్ రెడ్డి ఉన్నత చదువులు చదివి, సమాజానికి సేవలందిస్తూ ఒక మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
నీట్ పీజీలో కదిరి విద్యార్తి సత్తా
49 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)