శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుడిబండ ఎంఈఓ 2 గా గోవిందప్ప.

23 అక్టోబర్, 2026

గుడిబండ ఎంఈఓ 2 గా గోవిందప్ప. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి గుడిబండ ​

స్థానిక జడ్పీ హైస్కూల్‌ ‌హెచ్‌ఎం గోవిందప్పను ఎంఇఒ-2గా నియమిస్తూ విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం గోవిందప్ప ఎంఇఒ-2గా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎంఇఒ-2గా పని చేస్తున్న జయచంద్ర కుమార్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో 3 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ స్థానంలో గోవిందప్పను నియమించారు. గోవిందప్ప నియామకం పట్ల ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. గోవిందప్ప మాట్లాడుతూ మండల వ్యాప్తంగా జడ్పీ హైస్కూళ్లు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన, విద్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రధానంగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాడు-నేడు పనుల నాణ్యతను పరిశీలిస్తామన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్