కమిషనర్ గా జయకృష్ణ బాధ్యతలు స్వీకరణ
ప్రజాశక్తి తిరుపతి టౌన్ : తిరుపతి అభివృద్ధికి వంద రోజుల్లో ప్రణాళికను రూపొందిస్తానని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా ఎం జై కృష్ణ శనివారం కుటుంబ సభ్యులకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి అన్ని శాఖల అధికారులతో సంబంధం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రతిరోజు వార్డు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్య ఇస్తామని చెప్పారు. పిజిఆర్ఎస్లో వచ్చిన సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేలా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ కమాన్ కంట్రోల్ సగంలో నిలిచిపోయిందని వాటిని స్మార్ట్ సిటీ పథకంలో నిధులు బట్టి ఆ భవనాన్ని పూర్తి చేసినందుకు కృషి చేస్తామన్నారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి సందర్భంగా అడిషనల్ కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ కార్పొరేషన్ సూపర్డెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోమాతి, తులసి కుమార్, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ యు వఅన్వేష్, టౌన్ ప్లానింగ్ ఏసీపీలో మూర్తి, పార్వతి ప్రియ, మున్సిపల్ రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి కుమార్, పలువురు అభినందనలు తెలియజేశారు








కామెంట్‌లు (0)