శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

SL vs IND : లంచ్ బ్రేక్.. టీమిండియా 101/1

1 గంట క్రితం

run out
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మెరుగైన ఆరంభం అందుకుంది. గాలె వేదికగా శనివారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ, కేఎల్‌ రాహుల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. 37 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్‌ ఐదు ఫోర్లతో 32 పరుగులు చేశాడు. రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేయడంతో భారత్‌ స్కోరు వేగంగా పెరిగింది. రాహుల్‌ మాత్రం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

భోజన విరామానికి భారత్‌ 27 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 77 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులతో, దేవదత్‌ పడిక్కల్‌ 49 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్