తిరుపతి: జీఎం (ఐటీ)గా వెంకటేశ్వర్లు నియామకంపై వస్తున్న ఆరోపణలు వాస్తవ విరుద్ధమని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. వెంకటేశ్వర్లుకు ఎం.టెక్ (కంప్యూటర్ సైన్స్), ఎం.ఎస్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) అర్హతలు ఉండటంతో పాటు ఐటీ రంగంలో 32 ఏళ్ల అనుభవం ఉందని తెలిపారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలిక (స్టాప్-గ్యాప్) ఏర్పాటుగా ఆయనను జీఎం (ఐటీ) పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) నియమించినట్లు వెల్లడించారు. 2024 మార్చిలో అర్హతలు లేని వ్యక్తిని జీఎం (ఐటీ)గా నియమించారని పేర్కొంటూ, ఆ నియామకంపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అప్పటి అధికారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి ఇన్‌చార్జిని నియమించినట్లు వివరించారు. వెంకటేశ్వర్లు నాయుడుపై గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని విచారణలో తేలిందని పేర్కొన్నారు. శాఖాపరమైన దర్యాప్తులో అవినీతి జరిగినట్లు నిర్ధారణ కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
జీఎం(ఐటీ) నియామకంపై ఆరోపణలు నిరాధారం : అధికారులు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)