ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : చంద్రగిరిలో కారు బీభత్సం సృష్టించింది. చంద్రగిరిలో రోడ్డుపై నడుచుకొంటూ వెళుతున్న వారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ మహిళ గాయపడ్డారు. కారు బీభత్సంలో రోడ్డు పక్కన ఉన్న షాపులు ధ్వంసమయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఒక్కసారిగా స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విధ్వంసం సృష్టించిన కారు తిరుపతి రూరల్ ఎంపిపి కారుగా గుర్తించారు. గాయపడినవారిని హాస్పిటల్ కి తరలించారు. నిద్రమత్తులో కారు డ్రైవింగ్ చేశాడా లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారు బీభత్సం - ఇద్దరికి తీవ్రగాయాలు
28 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)