సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొమరాడకు కుంకి ఏనుగులు రాక

1 గంట క్రితం

elephants
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 07:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఈసారైనా ప్రయత్నం ఫలించేనా

ప్రజాశక్తి-కొమరాడ : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో గత ఎనిమిది ఏళ్లుగా తిష్టి వేసిన ఏనుగులు గుంపు బెడదను తెప్పించేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు కొమరాడ మండలానికి కుంకు ఏనుగులు చేరుకున్నాయి. సీతానగరం మండలంలోని ఎలిఫెంట్ జోన్ వద్ద ఇన్ని రోజులు శిక్షణ పొందిన కుంకి ఏనుగులు అభిమన్యు , జయంత్ సోమవారం సాయంత్రానికి కోనవలస గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు గుంపు వద్దకు అటవీశాఖ అధికారులు కుంకీలను తీసుకువచ్చారు. ఇటీవల ఈ ప్రాంతంలో ఏనుగులు గుంపు తిష్ట వేసి రైతు పంట పొలాలను ధ్వంసం చేయడం తెలిసిందే. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కేరళ నుంచి వచ్చిన కుంకి ఏనుగులు ఇప్పుడు కొమరాడ మండలంలో సంచరించనున్నాయి. అయితే ఏనుగులు గుంపు తరలించేందుకు గతంలో బాసింగి తదితర ప్రాంతాల్లో కుంకీలతో ఏనుగులు గుంపును కలిపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అప్పట్లో విఫలమయ్యింది. మరల విక్రమపురం కంబవలస పంచాయతీ పరిధిలో ఉన్న కొండ పక్కన ఉన్న గ్రామాలు ఈ గ్రామాలకు ఆనుకొని ఉన్న రహదారి పక్కనే ఉండడంతో కుంకీలను తీసుకువచ్చేందుకు ఏనుగులు గుంపులో కలిపేందుకు మంచి అవకాశం గా అటవీశాఖ అధికారులు భావించారు. అయితే సోమవారం సాయంత్రం నుంచి ఎలిఫెంట్ జోడి నుంచి రెండు కుంకి ఏనుగులను తీసుకువచ్చి ఏనుగులు గుంపులో కలిపేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేయనున్నారు. ఈ ప్రయత్నాల ఫలిస్తే విడతల వారీగా ఏనుగులు గుంపులో ఉన్న ఏనుగులను ఎలిఫెంట్ జోన్లకు తీసుకువెళ్లి వదిలేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్