సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి

2 గంటల క్రితం

koulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 06:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోని కౌలు రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సాగు సమస్యలను పరిష్కరించి, వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు కోరారు. ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ కు వెళ్లి కౌలు రైతుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కులు, రుణాలు, బీమా వంటి రాయితీలు ఏవీ క్షేత్రస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం లబ్ధి చేకూరకపోవడంతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు చేస్తున్న ప్రతి కౌలు రైతుకూ ఎటువంటి ఆంక్షలు లేకుండా వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, ప్రభుత్వం ద్వారా నేరుగా బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని, ఉచిత విద్యుత్‌తో పాటు రాయితీపై విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పివి.ఆంజనేయులు, కౌలు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరావు, కౌలు సంఘం జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు, నాయకులు ఎం.అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్