ప్రజాశక్తి - తిరుపతి ఎస్వియూ క్యాంపస్ : రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్‌చార్జి చైర్మన్‌గా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం భౌతికశాస్త్రం సీనియర్ ఆచార్యులు, ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆచార్య ఎస్. విజయ భాస్కర్ రావు బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర వేసేవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో విభాగాధిపతిగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఇతర పలు డిగ్రీ కళాశాలలకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా యుజిసి బీన్ గా ఇంకుబేటర్ సెంటర్ అయినటువంటి డిఎస్టి పర్స్ సెంటర్ కి డైరెక్టర్ గా, యుజిసి సిఎస్ఐఆర్ వంటి కేంద్ర విద్యా పరిశోధన సంస్థల నుంచి కోట్ల విలువైన భౌతిక శాస్త్ర పరిశోధనలకు ప్రాజెక్టు ప్రాజెక్టులను తీసుకొని విజయవంతంగా పూర్తి చేశారు. విద్యార్థులకు నిరంతరం పరిశోధనలో సలహాలు, సహాయక సహకారాలు, ప్రోత్సాహం ఇస్తూ అంచలంచలుగా పరిపాలన అనుభవం, పరిశోధనా అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆచార్య ఎస్ విజయభాస్కరరావు. ఆయన సీనియారిటీ పని అనుభవం, పరిపాలన విధానం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి ఇన్చార్జ్ ఉపకులపతిగా నియమించారు. ఆ తర్వాత రాష్ట్ర ఉన్నత విద్యా మనల్ని ఉపాధ్యక్షులుగా అదే కాలంలో శ్రీకాకుళం లోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ ఉపకులపతిగా నియమించారు.
ఉన్నత విద్య, పరిశోధన, వాతావరణ శాస్త్రం, రేడియో కమ్యూనికేషన్స్, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు తన పీహెచ్‌డీ పరిశోధనలో దక్షిణ భారతదేశంలోని రేడియోక్లైమటాలజీపై విస్తృత అధ్యయనాలు నిర్వహించారు. రేడియో తరంగాల ప్రసారం, వాతావరణ పరిస్థితులు, సిగ్నల్ ఫేడింగ్ మధ్య ఉన్న సంబంధాలపై ఆయన ప్రత్యేకంగా పరిశోధనలు చేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ సహకారంతో మోనోస్టాటిక్ సోడార్‌ను అభివృద్ధి చేసి, వాతావరణంలోని ప్రాథమిక పొరల లక్షణాలను అధ్యయనం చేశారు. 1990–91లో అంటార్కిటికాలో సోడార్‌ను ఏర్పాటు చేసి అక్కడి వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు నిర్వహించారు. పీహెచ్‌డీ అనంతరం భారతీయ MST రాడార్‌ను ఉపయోగించి వాతావరణంలోని టర్బులెన్స్, గ్రావిటీ వేవ్స్‌పై పరిశోధనలు కొనసాగించారు. మొబైల్, రేడియో కమ్యూనికేషన్స్ రంగాల్లోనూ ఆయన విశేష పరిశోధనా సేవలు అందించారు.
2012–2014 మధ్య సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో డిజిటల్ వీడియో బ్రాడ్‌కాస్టింగ్‌పై రెండేళ్లపాటు పరిశోధనలు చేశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో UGC–SVU సెంటర్ ఫర్ MST రాడార్ అప్లికేషన్స్ అభివృద్ధికి ఆయన కీలకంగా కృషి చేశారు. ఈ కేంద్రం జాతీయ స్థాయి ప్రధాన పరిశోధనా సదుపాయంగా గుర్తింపు పొందడంతో పాటు, ఇస్రో సహకారంతో అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫెరిక్ సైన్సెస్‌గా అభివృద్ధి చెందింది. ఇస్రో సహకారంతో స్పేస్ టెక్నాలజీలో ఎం.టెక్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. SVU–NARL సహకారంతో పలువురు విద్యార్థులు పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సహించారు. భారతీయ విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా అత్యాధునిక మెటియర్ రాడార్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన ముఖ్యపాత్ర వహించారు. పరిశోధనలను మరింత బలోపేతం చేసేందుకు లిడార్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సదుపాయాల అభివృద్ధికి కూడా కృషి చేశారు. ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు ఇప్పటివరకు 150 కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. 35 మంది పీహెచ్‌డీ, ఆరుగురు ఎం.ఫిల్ విద్యార్థులకు పరిశోధనా మార్గదర్శకత్వం అందించారు. NSSS–2012 తో పాటు, 2017 లో నిర్వహించిన 104 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించి తన నిర్వహణా సామర్థ్యాన్ని చాటుకున్నారు. ఆచార్య ఎస్. విజయ భాస్కర్ రావు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమితులు కావడం పట్ల ఎస్వీయూ ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు హర్షం వ్యక్తం చేశారు. తమ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించిన విజయ భాస్కర్ రావు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా నియమితులు కావడం ఎస్వీయూకే కాకుండా ఫిజిక్స్ విభాగానికి కూడా గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో విశేష అనుభవం కలిగిన ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు నేతృత్వంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతుందని ప్రొఫెసర్ దేవప్రసాద్ ఆకాంక్షించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఉన్నతాధికారులు, భౌతి శాస్త్ర విభాగం ఆచార్యులు, వర్సిటీ అధ్యాపకులు, అకాడమిక్ కన్సల్టెంట్లు, పరిశోధకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.








కామెంట్‌లు (0)