- జాతీయ రహదారి 216 పై కుప్పకూలిన భారీ సైన్ బోర్డు
ప్రజాశక్తి - బాపట్ల : బాపట్ల జిల్లా లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకుని, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం సుమారు గంట పాటు దంచికొట్టింది. భారీ వర్షం కారణంగా బాపట్ల పట్టణం లోని పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచి జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా వీచిన గాలి వాన తీవ్రతకు జాతీయ రహదారి 216 పై బాపట్ల ఎ 1కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ సమీపంలో సూర్యలంక, ఒంగోలు, నెల్లూరు, చెన్నై రహదారి మార్గాల దూరాలను సూచిస్తూ ఏర్పాటు చేసిన భారీ హార్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ వాహనాలు ఏవి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హోల్డింగ్ రహదారిపై పడి పోవడం తో వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించి, అనంతరం కుప్పకూలిన హార్డింగ్ ను తొలగించే చర్యలు చేపట్టారు.వర్షం కొనసాగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.








కామెంట్‌లు (0)