శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైభవంగా తిరుమల శ్రీవారి చక్రస్నానం

20 అక్టోబర్, 2026

Chakrasnanam for Lord Sri Venkateswara at Tirumala held with great grandeur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 11:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పుష్కరిణిలో వేలాది మంది యాత్రికుల పుణ్యస్నానాలు

  • శ్రేయస్సు కోసం పవిత్ర అవభృథ స్నానం


ప్రజాశక్తి-తిరుమల (తిరుపతి) : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టమైన చక్రస్నానం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా, వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.


వైభవంగా పల్లకీ ఉత్సవం ....

చక్రస్నానానికి ముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.


వేదమంత్రాల నడుమ స్నపన తిరుమంజనం ....

పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్వామివారికి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించిన ఈ పవిత్ర క్రతువులో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలను ఉపయోగించారు. టీటీడీ వేదపారాయణదారులు ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర వేదమంత్రాలను పఠించారు. అనంతరం తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి పాశురాలను పఠించారు. స్వామివారికి, అమ్మవార్లకు విశిష్టమైన పుష్పమాలలను అలంకరించారు.


లోకక్షేమం కోసం పవిత్ర అవభృథ స్నానం ....

తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు చక్రస్నానం సంపూర్ణతను చేకూర్చే పవిత్ర ఘట్టం. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, సకల జీవరాశులకు శుభం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ అవభృథ స్నానాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను మహాయజ్ఞంతో సమానంగా భావిస్తారు. యజ్ఞం ముగింపులో నిర్వహించే అవభృథ స్నానం మాదిరిగానే, బ్రహ్మోత్సవాల ముగింపులో చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల ద్వారా సమస్త లోకానికి శుభం కలగాలని, క్రతువుల సంపూర్ణ ఫలాలు లభించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తారు.


సుదర్శన చక్ర స్పర్శతో పుష్కరిణి జలాలకు పవిత్రత ....

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లను పవిత్ర పుష్కరిణి జలాల్లో ముంచి చక్రస్నానం చేయించారు. అదే సమయంలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తిభావం, వేదమంత్రాల నడుమ జరిగిన చక్రస్నానంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి.
Chakrasnanam for Lord Sri Venkateswara at Tirumala held with great grandeur


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్