ప్రజాశక్తి - తిరుపతి : తిరుపతి జిల్లా 48 వ డివిజన్‌లో రిగ్గింగ్ కలకలం చోటుచేసుకుంది. రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టిడిపి శ్రేణులను సిపిఎం నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి టిడిపి నేతలపు పోలింగ్ కేంద్రం నుంచి బైటకు పంపిచేశారు. పోలీసులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రం బయట సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.







కామెంట్‌లు (0)