శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్డీఏ అసమర్థ పాలన పైసూళ్లూరుపేటలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ

2 రోజుల క్రితం

Congress cadres hold huge rally in Paisullurpet against NDA's incompetent governance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 03:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి) : భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేపర్ లీకులు, అయోధ్య రామ మందిరం కుంభకోణాలు తప్ప భారతదేశంలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు ఎద్దేవా చేశారు.సూళ్లూరుపేటలో బుధవారం ఆర్ R&B బంగ్లా నుండి బజారు మీదుగా ర్యాలీ చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి విద్యార్థులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, మీరు చేసే అన్యాయాలు అక్రమాలు లను ఖండిస్తే అక్రమంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని, ఈ విషయాలన్నిటినీ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారని 2029 ఎన్నికలలో ప్రజలే మీకు సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు.నీటి పేపర్ లీకేజీల వలన 20 మంది విద్యార్థుల ప్రాణాలను బలగొన్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవదానం,కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ రమేష్ రెడ్డి, భాస్కరరావు స్టేట్ ఓబీసీ జనరల్ సెక్రెటరీ, మావుడురు వెంకటాచలపతి సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్, సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు, మహిళా నాయకులు శ్వేత, చాముండేశ్వరి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్