బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హిమాచల్‌‌ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం

24 జులై, 2026

Himachal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వాహనంపై బండరాళ్లు పడటంతో 13 మంది మృతి

​సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్‌ -స్పితి జిల్లాలో ఉదయ్‌పూర్‌-పాంగి రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఎస్‌యువి వాహనంపై పెద్ద బండరాళ్లు దొర్లిపడటంతో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. మృతుల్లో ఆరు నెలల పసికందు కూడా ఉంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 మంది ప్రయాణికులతో కుల్లు నుండి కిల్లార్‌కి వెళుతున్న ఎస్‌యువిపై బండరాయి దొర్లిపడటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. బండరాయి ఢీకొన్న ధాటికి కారు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సాయంతో ఆర్మీ మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. అయితే అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. మరో ఇద్దరు వాహనం నుండి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారని లాహౌల్‌-స్పితి డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, గురువారం ఉదయ్‌పూర్-కిల్లార్ రహదారి మూసివేయ బడటంతో వారు టిండి వద్ద చిక్కుకుపోయారు. రహదారి తిరిగి తెరుచుకున్న తర్వాత శుక్రవారం పాంగికి బయలుదేరారు, కానీ వారి వాహనం ప్రమాదానికి గురవడంతో ప్రాణాలు కోల్పోయారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్