మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2027 మార్చి 5న ‘ఎల్లమ్మ’ విడుదల..

39 నిమిషాల క్రితం

yellamma.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 06:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు గ్రామీణ యాక్షన్‌ డ్రామా

దేవిశ్రీ ప్రసాద్‌ (డీఎస్పీ) కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘ఎల్లమ్మ’ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘బలగం’ చిత్రంతో గుర్తింపు పొందిన వేణు యెల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో అనంతిక సనిల్‌కుమార్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ‘ఎల్లమ్మ’ను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్‌.. ఈ సినిమాతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కానుండటం విశేషం. నటనతో పాటు ఈ చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకత్వం, నిర్మాణం, సంగీతం, గ్రామీణ కథాంశం కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్