గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మోర్ సూపర్ మార్కెట్‌లో గడువు ముగిసిన పాలు విక్రయం

06 ఆగస్టు, 2026

milk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 03:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్‌లో గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) పాల ప్యాకెట్లను విక్రయించారని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. మార్కెట్‌లో కొనుగోలు చేసిన పాల ప్యాకెట్‌ను ఇంటికి తీసుకెళ్లి కాచగా వెంటనే పాలు విరిగిపోయాయని ఆయన తెలిపారు. పాల ప్యాకెట్‌పై ఉన్న తయారీ, గడువు తేదీలను పరిశీలించగా, గడువు ముగిసినట్లు గుర్తించినట్లు వినియోగదారుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు.చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు  పాల ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి వారికి గడువు ముగిసిన లేదా పాడైన పాలు అందితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్