ఢిల్లీ : జర్మనీలోని బెర్లిన్ రాష్ట్ర ఎన్నికల్లో వామపక్ష పార్టీ డై లింకె సాధించిన చారిత్రక విజయంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ, ‘‘న్యూయార్క్ నుంచి బెర్లిన్ వరకు సోషలిస్ట్ ప్రత్యామ్నాయం విజయం సాధిస్తోంది!’’ అని పేర్కొన్నారు. డై లింకె పార్టీని చారిత్రక విజయం వైపు నడిపించిన ఎలిఫ్ ఎరాల్ప్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన బేబీ, గృహ హక్కులు, సామాజిక న్యాయం, ఆత్మ గౌరవంపై ఆమె ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. సంప్రదాయవాద పాలనకు వ్యతిరేకంగా బెర్లిన్ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు, మితవాద శక్తులను వెనక్కి నెట్టడంలో నిర్థిష్ట కార్యక్రమ వ్యూహం సఫలం కాగలదని రుజువు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మికరాజ్య రాజకీయాలను అనుసరించే వారందరికీ ఈ విజయం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్న బేబీ, శ్రామిక ప్రజలకు మరింత శక్తి చేకూరాలని ఆకాంక్షించారు.
Print Editionన్యూయార్క్ నుంచి బెర్లిన్ వరకు సోషలిస్ట్ ప్రత్యామ్నాయం : ఎంఎ బేబీ
41 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)