ప్రజాశక్తి-రైల్వేకోడూరు (తిరుపతి) : రాష్ట్రంలో వైసీపీ పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపి కుల, మత, ప్రాంత, విద్వేషాలను రెచ్చ గొట్టి లబ్దిపొందాలనుకోవడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .... రావణ్,జడ శ్రావణ్, ప్రకాశరాజ్ వెనుక ఉండి కుట్రలు పన్నుతోంది సాక్షాత్తు వైసీపీ పార్టీ,జగన్మోహన్ రెడ్డి అని తేల్చి చెప్పారు.క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించే దిశగా వైసీపీ తీవ్రమైన కుట్రలు పన్నుతోందని,రావణ్ వెనుక ఉన్నది కచ్చితంగా వైసీపీనే అని,రావణ్ తో కలిసి పని చేసిన శ్రావణ్ సరిపోవడం లేదని నేరుగా వైసీపీ వాళ్లే రంగంలోకి దిగారు.ఉపా కేసులో అరెస్టు అయిన రావణ్ కి న్యాయ సహాయం చేస్తామని వైసీపీ మీడియా ముఖంగా ప్రకటించింది.హే రామ్ అంటూ రావణ కోసం జగన్ తెగ బాధ పడ్డాడని, వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ నుంచే రావణ్ శ్రావణ్ ప్రకాష్ రాజ్ వ్యవహారాలు మానిటర్ చేస్తున్నారనీ ఈ క్రమంలో ప్రజలందరూ కొన్ని విషయాలు గ్రహించాలని చెప్పారు.దళిత క్రైస్తవుల రిజర్వేషన్లకు సంబంధించినది సుప్రీం కోర్టులోని అంశం.మరో వైపు డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం పెదపేటలో రామాలయంపై వివాదం నెలకొంది. క్రైస్తవులను రెచ్చగొట్టే ముఠాలు రంగంలోకి దిగాయి,సోషల్ మీడియాలో హిందూ దేవతలను, సనాతన ధర్మాన్ని కించపరచేలా కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానెల్స్, రావణ్ లాంటి పెయిడ్ వ్యక్తులు పుట్టుకొచ్చారు. అభ్యంతరకరమైన భాషలో దూషిస్తున్నారు. వీరికి పొరుగు రాష్టం నటుడు ప్రకాష్ రాజ్ తోడయ్యారని,రావణ్ అనే వ్యక్తి క్రైస్తవుడు, ప్రకాష్ రాజ్ క్రైస్తవుడు.ఏలూరులో దళిత క్రైస్తవ శంఖారావం పేరుతో జడ శ్రావణ్ సభ ఏర్పాటు చేశారు.ఈ సభను అందరూ జాగ్రతగా పరిశీలన చేస్తే – ప్రధాన వక్తలు ఎవరూ కూడా దళితుల గురించిగానీ, క్రైస్తవుల గురించిగానీ, దళిత క్రైస్తవుల గురించిగానీ వారి సంక్షేమం గురించి గానీ మాట్లాడారా అని ప్రశ్నించారు. అందరూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడమే అజెండాగా పెట్టుకున్నారని పవన్ కళ్యాణ్ మీద అభ్యంతరకర భాషలో మాట్లాడారని,దీన్ని బట్టే అర్థం అవుతోంది పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకొని కొన్ని ముఠాలు పని చేస్తున్నాయని, ఎందుకు అంటే దేశంపట్ల బాధ్యతతో,దేశ సమైక్యత సమగ్రతల గురించి బలంగా మాట్లాడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.సందర్బంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ సనాతన ధర్మం అంటే గిట్టని వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించే పనిలో ఉన్నారని,ఈ కుట్రలో ఒక పాత్రధారి జడ శ్రావణ్ కుమార్. ఈ ప్రాక్టీస్ చేయని లాయర్ తో ప్యాకేజీ కుదుర్చుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. రావణ్ అనేవాడిని ఉపా కేసులో అరెస్టు చేయగానే శ్రావణ్ అనేవాడికి మతి భ్రమించిందని, జగన్ మీద పోరాటానికి రూ.25 కోట్లు సొంత డబ్బు ఖర్చుపెట్టాను అని చెప్పిన శ్రావణ్ కి అంత సొమ్ము ఎలా వచ్చిందో చెప్పాలి అని ప్రశ్నించారు.మార్కెట్ కమిటి ఛైర్మెన్ పగడాల వరలక్ష్మి మాట్లాడుతూ .... సుగాలీ ప్రీతి తల్లిని మోసం చేసిన మాట వాస్తవం కాద అని అన్నారు.ఏ ప్రాక్టీసు లేని లాయర్ అని బార్ కౌన్సిల్ రికార్డుల్లో జడ శ్రావణ్ పేరు ఉన్న మాట వాస్తవం.వీటికి ఏ మాత్రం సమాధానం చెప్పలేని శ్రావణ్ కి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.జోసెఫ్ రావణ్ శ్రావణ్,ప్రకాష్ రాజ్ ల మధ్య ఉన్న క్యాష్ బంధం ఏమిటి వీళ్ళ ముగ్గురితో తాడేపల్లి ప్యాలెస్ ఉన్న లింక్ ఏమిటి అని,తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్ర నడుపుతున్న వారికి అంతర్జాతీయ ఫండింగ్ వస్తుంది అనే సందేహం ఉందని,ఆంధ్ర ప్రదేశ్ లో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు రేపేందుకు అంతర్జాతీయ ఫండింగ్ ఎవరికి అందుతోంది అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తే అసలు కుట్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారని అన్నారు.కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పగడాల చంద్ర శేఖర్, వేంకటేష్, కారుమంచి సంయుక్త,మద్దూరి మన్మధ,రాగిపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కుల, మత, ప్రాంత విద్వేషాలే వైసిపి రాజకీయ అస్త్రాలు : ఎమ్మెల్యే శ్రీధర్
11 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 04:54 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)