శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పార్టీ కోసం కష్టపడిన జన సైనికులకు అన్యాయం

1 గంట క్రితం

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 05:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు యనమల భాస్కర్‌

ప్రజాశక్తి - రైల్వే కోడూరు : రైల్వే కోడూరు నియోజకవర్గంలో పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన జనసైనికులకు స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని జనసేన పార్టీ ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు యనమల భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపుల్లో 2014 నుండి జనసేన పార్టీలో పని చేస్తున్న వారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సంబంధించి 5 మెన్ కమిటీ ఏర్పాటు చేశారని, అందులో తాను ఒక సభ్యుడినని అన్నారు. తనకు రాయలసీమలోని 5 పార్లమెంటు నియోజకవర్గాలను కేటాయించారని అన్నారు. రైల్వే కోడూరు పట్టణంలో మొదటి నుండి పనిచేస్తున్న జన సైనికుడు ఉత్తరాది శివకు ఎంపీటీసీ సీటు కేటాయించకుండా వైసిపి నుంచి వచ్చిన వారికి సీటు కేటాయించడం దారుణమని అన్నారు. ఓబనపల్లెలోనూ ఆ పంచాయతీకి చెందిన అంకి శెట్టి మనీకి కేటాయించకుండా కోడూరు పట్టణంలోని వారికి కేటాయించారని అన్నారు. తాను ఇచ్చిన బీఫారాలు ఫేక్ అని జనసేన పార్టీ వాళ్లే ప్రచారం చేయడం విడ్డూరమని అన్నారు. అవి ముమ్మాటికీ ఒరిజినల్ బీఫారాలు అని ఆయన తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో జరిగిన విషయాలన్నీటిని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ముద్దపోలు సభాపతి, ఉత్తరాది శివ, నాగరాజ, అంకిపల్లె మనీ, అమర్ తదితరులు పాల్గొన్నారు.


జనసేన పార్టీలో కార్పోరేటర్‌ టికెట్‌ వ్యవహారంలో వివాదం

తిరుపతి జనసేన పార్టీలో కార్పొరేటర్ టికెట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. 47వ డివిజన్ నుంచి నామినేషన్ వేసిన జనసేన నాయకుడు రాజేష్ ఆచారి.. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు బి-ఫామ్ ఇవ్వాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన "హవాయి చెప్పులు వేసుకున్న వ్యక్తిని కూడా ఆదుకుంటాం" అన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన తనకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్