బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ను అక్రమ అరెస్టు యత్నం నిరసనగా వామపక్షాలు నిరసన

13 గంటల క్రితం

Left-wing parties protest against the attempted illegal arrest of SFI Joint Secretary Aishe Ghosh.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 11:57 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : జంతర్ మంతర్ వద్ద ఉద్యమంపై ప్రతీకార చర్యలకు కేంద్రం పాల్పడుతోంది. విద్యార్థినాయకులపై పాత కేసులను బయటకి తీసి వేటాడుతుంది. ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయంలోకి పోలీసులు చొరబడి ఎస్ఎఫ్ఎ సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ను అరెస్టు చేయడాని యెట్నించినందుకు నిరసనగా తిరుపతి తిలక్ రోడ్లోని పాత మున్సిపల్ కార్పొరేషన్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపేందుకు, మోడీ ప్రభుత్వం సిద్ధపడింది. ఐదేళ్ల నాటి కేసులో కొన్ని నెలల క్రితం పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ కింద ఐషీ ఘోష్ను అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నించడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు.జంతర్ మంతర్ ఉద్యమానికి సంబంధించి యువతను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించినందున, పాత కేసు నమోదు చేసి ఐషీఘోష్ను తీహార్ జైలులో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, యూనిఫాం, నేమ్ ప్లేట్.లేని అధికారి నేతృత్వంలో ప్రైవేట్ వాహనంలో వాహనంలో వచ్చిన పోలీసులను సిపిఎం ఎంపిలు, జాన్ బిట్టాస్ వచ్చినపార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు అని గుర్తు చేశారు. విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నవారిని దోషులుగా చిత్రీకరిస్తూ ఆర్ఎస్ఎస్ పత్రిక 'ఆర్గనైజర్' ఓ జాబితాను విడుదల చేసిన వెంటనే పోలీసులు ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఉద్యమంలో పాల్గొన్నవారిపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా, ఉద్యమంలో పాల్గొన్నవారిని గతంలో వారు పాల్గొన్న ఇతర ఆందోళనల పేరిట అరెస్టు చేసేందుకు రాజకీయ కుట్రకు పాల్పడడం దారుణం. అక్రమ అరెస్టులు చేస్తూ వద్దు మొన్న ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్మ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టీ సుబ్రహ్మణ్యం, ఎస్ జయ చంద్ర, 5వ జిల్లా కార్యదర్శి పి సాయి లక్ష్మి, రైస్ సంఘం జిల్లా కార్యదర్శి పి హేమలత, సిపిఎం నాయకులు బుజ్జి, నరేంద్ర, రాధాకృష్ణ, ఎన్ డి శీను, సిపిఐ జిల్లా నాయకులు పెంచలయ్య, విశ్వనాధ్, రాధాకృష్ణ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్