శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబాలుడి హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగారశిక్ష‍

23 అక్టోబర్, 2026

arest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చిత్తూరు పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు

​ప్రజాశక్తి - తిరుపతి (మంగళం) : అన్నమయ్య జిల్లా కెవి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి ఒడిగట్టి, అత్యంత పాశవికంగా హత్యచేసిన కేసులో దోషిగా తేలిన దుండగుడికి చిత్తూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అరుణ సారిక.. కఠిన శిక్ష ఖరారు చేశారు. ముద్దాయి జీవితాంతం జైలులోనే గడిపేలా తీర్పు వెలువరించారు. 2021 అక్టోబర్ 12న కెవిపల్లి మండలం చీనేపల్లి పంచాయతి ఎగువ మేకలవారిపల్లెకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. బాలుడి మేనమామ మేకల వేణుగోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ బాలకృష్ణ 'బాయ్ మిస్సింగ్' కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ముమ్మరంగా గాలించగా మేకలవారిపల్లికి దక్షిణాన ఉన్న బొప్పాయి తోటలో బాలుడు శవమై కనిపించాడు. అదే గ్రామానికి చెందిన కాకులారం నందకుమార్ రెడ్డి అలియాస్ ఉదయ్ (20) అనే యువకుడు బాలుడిని మాయమాటలతో తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో మెడలోని టవల్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. కోర్టు విచారణలో ఇది రుజువుకావడంతో జడ్జి పై మేరకు తీర్పు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్