మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్మగ్లింగ్.. భారీగా వెండి నాణేలు

2 గంటల క్రితం

Smuggling at Shamshabad Airport: Massive quantity of silver coins seized.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 11:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వెండి నాణేలు పట్టుబడ్డాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద భద్రతా సిబ్బంది 7 కిలోల వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలోని చెకింగ్ పాయింట్ వద్ద ప్రయాణికులను, వారి లగేజీని తనిఖీ చేస్తుండగా కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం సిబ్బంది ఈ వెండి నాణేలను గుర్తించారు. లగేజీ బ్యాగులో ఎలాంటి బిల్లులు లేకుండా భారీ మొత్తంలో వెండి నాణేలను తరలిస్తుండటంతో అధికారులు తక్షణమే సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నాణేలకు సంబంధించిన రసీదులు, బిల్లులు, ఇతర కొనుగోలు పత్రాలపై సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ఆ ప్రయాణికుడిని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. వెండి నాణేల లెక్కింపు, వాటి విలువ, ఈ రవాణా వెనుక ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యల కోసం కస్టమ్స్ లేదా ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్